“రాజు గారి గది 3 ” మూవీ రివ్యూ : భయపెట్టలేని రాజు గారి గది

"రాజు గారి గది 3 " మూవీ రివ్యూ
“రాజు గారి గది 3 ” మూవీ రివ్యూ

 ‘రాజు గారి గది 3’ మూవీ రివ్యూ రేటింగ్ : 2.75/5.0

విడుదల తేదీ : అక్టోబర్ 18 , 2019

నటీనటులు : అశ్విన్‌ బాబు, అవికా గోర్‌, అలీ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్‌ శ్రీను, శివశంకర్‌ మాస్టార్‌, హరితేజ

దర్శకత్వం : ఓంకార్‌

సంగీతం : ఎస్ తమన్

ఎడిటర్ : గౌతంరాజు

కథ:

మాయ (అవికా గోర్‌) ఓ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో గొప్ప మాంత్రికుడు. మాయని తాకాలని ఎవరు ప్రయత్నించినా ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి పని పడుతుంది. మరోవైపు అశ్విన్‌ ఓ కాలనీలో ఆటోడ్రైవర్‌. కాలనిలో తాగి అందరి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాడు అని ఇరుగుపొరుగువాళ్ళు ఒక పధకం తో మాయను అశ్విన్‌ ప్రేమించేలా చేస్తారు. అశ్విన్‌ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్‌, తన మామా అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? మాయ వెనుక ఉన్న యక్షిని ఎవరు? మాయకు కవచం గా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్‌ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే .

నటీనటులు:

అశ్విన్‌,అలీ మామా అల్లుళ్ళుగా నటించారు అశ్విన్ నటన పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్‌ మాడ్యులేషన్‌ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్‌ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కొచం కాసేపు దెయ్యంగా అలరించింది . ఫస్ట్‌ హాఫ్‌లో అలీ, అశ్వినులతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్‌ మాస్టార్‌, గెటప్‌ శ్రీను తదితరులు బాగా నవ్వులు పంచారు.సెకండ్‌ హాఫ్‌లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్‌ ఘోష్‌, సీనియర్‌ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్‌ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్‌ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పూయించారు .

విశ్లేషణ:

దర్శకుడు ఓంకార్ హర్రర్‌ కామెడీ నే ఎంచుకున్న ,ఎక్కువ భాగం కామెడీనే పంచారు ,సగటు ప్రేక్షకుడు థ్రిల్ ,భయపడే అంశాలు కొరవడినవి అనే చెప్పవచ్చు దర్శకుడి గా ఓంకార్ బాగా నవ్వించాడు ,బుర్ర సాయిమాధవ్ డైలాగ్స్ హాస్యాన్ని,తమన్ మ్యూజిక్ పర్లేదు అనిపించింది .

చివరగా బయపెట్టలేక పోయిన కడుపుబ్బా నవ్విస్తున్న రాజుగారి గది 3

బలాలు

సెకండాఫ్ కామెడీ
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
ఓంకార్‌ టేకింగ్‌

బలహీనతలు

కథ, కథనం
ఫస్టాఫ్‌లో సాగదీత
హార్రర్‌ పెద్దగా లేకపోవడం