ఇదీ.. టాలీవుడ్ లో చరణ్ కే సాధ్యమా?

Ram Charan Hard Workమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ,బోయపాటి మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన చిత్రం ‘వినయ విధేయ రామ’.భారీ అంచనాలతో ఈ సినిమా ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తముగా విడుదల కాబోతుంది.

అందరిలో బెస్ట్ గా రామ్ చరణ్ భార్య..

ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ చూస్తే ,దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.ఎంతో నియమ నిష్ఠలతో కఠోర పద్దతులను అనుసరిస్తేనే ఇది సాధ్యం.అది కూడా ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాదు.దీని వెనుక కొన్ని సంవత్సరాల శ్రమ ఉందట.

రామ్ చరణ్ తన ఇంట్లోనే అధునాతన పరికరాలతో జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు.నిపుణుడైన కోచ్ సహాయంతో తన బాడీని ఇలా మలచుకున్నాడట.బాలీవుడ్ లో ఇలాంటి బాడీ కలిగిన వారు సల్మాన్ ఖాన్ ,హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.కాగా ఇప్పుడు ఈ కోవలో రామ్ చరణ్ చేరారు.