కండల వీరుడిలా కనిపించబోతున్న రామ్!

Hero Ram New Look

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’,ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై,రామ్ లుక్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి.

‘మహర్షి’ షూటింగ్ పూర్తయిందట!

నిజానికి రామ్ ‘నేను శైలజ’ సినిమా తరువాత మంచి విజయాలు అందుకోలేదు.ఇక డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ‘టెంపర్’ తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు.దీంతో వీరిద్దరు ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా రామ్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేశాడు.ఈ ఫొటోలో రామ్ బరువైన డంబుల్స్ పట్టుకొని జిమ్ లో తెగ కష్టపడుతున్నాడు.

అసలు విషయం ఏమిటంటే రామ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కండల వీరుడిలా కనిపించబోతున్నాడట.ఇందుకోసం ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నాడట. ఇక ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్ ,నభ నటేష్ నటిస్తున్నారు.