మరో వైవిధ్యమైన పాత్రల్లో రమ్య కృష్ణ

బాహుబలి చిత్రంలో శివగామిగా ఓ పవర్ ఫుల్ రోల్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ మరో సారి ఊహించని పాత్రలో నటిస్తుంది.

బన్నీ తో జతకట్టనున్న కియారా ..

వైవిధ్య పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన రమ్యకృష్ణ..తాజాగా శృంగార తారగా కనిపించబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రమ్య కృష్ణ కోలీవుడ్ లో ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో నటిస్తుంది. 2004లో వచ్చిన సునామి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాసిల్, మిస్కీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

త్యాగరాజన్ కుమారా రాజ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక వేశ్యగా లేదా పోర్న్ స్టార్ గా కనిపించబోతున్నట్టు టాక్ వినబడుతుంది.

పి ఎస్ వినోద్ , నిరవ్ షా సినిమాటోగ్రఫీ ని అందిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 

Advertisement