జయ పాత్రకి భారీ పారితోషకం

 తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను ఆధారంగా చేసుకొని సినిమాలను చిత్రికరించడంలో చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారనే విషయం తెలిసిందే.

దివ్యాంగురాలి పాత్రలో ‘భాగమతి’

Ramyakrishna remunaration details in jayalalitha biopic

ఇప్పటికే దర్శకులు భారతి రాజా, ఏఎల్ విజయ్, ప్రియదర్శిని వంటి వారు జయ బయోపిక్ ను రూపొందించేందుకు ముందుకు రాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ వెబ్‌ సిరీస్‌ గా జయలలిత జీవితాన్ని
చూపించబోతున్నాడు.

ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు.బాహుబలి తరువాత రమ్యకృష్ణ రేంజ్‌ ఏ స్థాయి కి చేరుకుందో తెలియంది కాదు.ఈ బయోపిక్‌ వివాదాస్పదం అయ్యే అవకాశం కూడా ఉండటంతో రమ్యకృష్ణ భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సిరీస్‌లో జయలలిత సినీ నటిగా ఉన్న సమయంలో వచ్చే సన్నివేశాల్లో యువ కథానాయిక ఆ పాత్రలో కనిపించనున్నారు.

మూడు సీజన్లుగా తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ్‌, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.ఇక జయ బయోపిక్ 30 ఎపిసోడ్స్ ఉండే వెబ్ సిరీస్ గా బుల్లితెర పై కనిపించనుంది.

Advertisement