‘ఎన్టీఆర్’ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో

బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన రానా దగ్గుపాటి…అందరితో ఎలాంటి బేధం లేకుండా కలిసి మెలిసి ఉంటారు.ఇక రానా బెస్ట్ ఫ్రెండ్స్ లలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ హీరో ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

‘ఆర్ఆర్ఆర్’లో ఇప్పుడు హీరోయిన్స్ వంతు..

అమరచిత్రకథ అనే పుస్తకాల సిరీస్ ను తారక్‌ కు గిఫ్ట్ గా పంపించాడు. ఈ అమరచిత్రకథలో పురాణాలు, వీరగాథలు, చరిత్రలోని గొప్పవ్యక్తుల జీవితాలు, గొప్ప సంఘటనలు, జానపద కథలు కామిక్స్ రూపంలోఉండటం విశేషం.

కాగా అమరచిత్రకథ పుస్తకాల సిరీస్ ను అందుకున్న తారక్‌ దీని పై తన స్పందనను ట్వీటర్ లో పోస్ట్ చేస్తూ..’చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి, ఈ కామిక్ అమరచిత్రకథ పుస్తకాల ఇచ్చినందుకు థ్యాంక్స్ రానా.. వీటి వల్లన నా బాల్యాన్ని అభయ్ తో పంచుకోవడానికి అవకాశం దొరికింది’ అంటూ తారక్ పోస్ట్ చచేశారు.ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.