క్రేజీ కాంబినేషన్ లో రానున్న న్యూ మూవీ

దగ్గుబాటి రానా నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.ఇదే విషయాన్ని రానా అధికారికంగా మీడియాకు తెలియజేశాడు.

‘గృహం’ డైరెక్టర్ కి ఓకే చెప్పిన రానా

ఈ చిత్రాన్ని హిందీలో తీయడానికి కూడా నిర్ణయించారు,దీనికి అక్షయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారని ప్రకటించారు.తెలుగు వెర్షన్ కోసం రాజ్ తరుణ్ ను సెలెక్ట్ చేసుకోగా , హిందీ లో ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని సమాచారం.

అయితే రానా, అక్షయ్ ల మధ్య రీసెంట్ గానే ఓ ఒప్పందం కుదిరిందని, త్వరలోనే ఈ చిత్రాని ప్రారంభిస్తామని రానా తెలిపారు.అయితే ఈ చిత్రం మరాఠీలో సూపర్ హిట్టయిన ‘పోస్టర్ బాయ్స్’ ఆధారంగా తెరకెక్కనుంది.

అంతేకాకుండా ఈ చిత్రంలో రానా మరియు అక్షయ్ కుమార్ లు ఇద్దరు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారు అని తెలుస్తుంది.