రంగస్థలం సినిమా రివ్యూ : తెలుగు వాళ్లకు ఇంత ‘కొత్త’దనం కష్టమే !

రంగస్థలం సినిమా రివ్యూ | రంగస్థలం రివ్యూ | రామ్ చరణ్ | సమంత |సుకుమార్ |ఆది పినిశెట్టి |యాంకర్ అనసూయ | జగపతిబాబు 

రంగస్థలం సినిమా రివ్యూ : 3.0/5.0

Rangasthalam Review

రామ్ చరణ్ ,సమంత జంటగా సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న రంగస్థలం సినిమా చాలా అంచనాల మధ్య ఈ రోజు విడుదల అవుతోంది . చెవిటి చిట్టి బాబు గా చరణ్,డీ గ్లామర్ పల్లెటూరి అమ్మాయి పాత్ర లో సమంత ఇప్పటికే అలరించారు . దేవి పాటలు కూడా వినగా వినగా బాగానే వున్నాయి. ఎంత సక్కగున్నావే అయితే అచ్చ తెలుగందం లా ముచ్చటగా ఉందని మన్ననలు కూడా అందుకుంది .

టీవీ యాంకర్ అనసూయ రంగమ్మత్త గా ,జగపతిబాబు ఊరి పెద్ద గా , ఆది పినిశెట్టి ఊరి ప్రెసిడెంట్ అభ్యర్థి గా ఇలా పలు ఆకర్షణలతో సిద్దమయిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ : ట్రైలర్ లోనే కథ చెప్పేసారు రంగస్థలం చిత్ర యూనిట్ . 1985 ల నాటి రంగస్థలం అనే గ్రామం లో వున్న చిట్టి బాబు(రామ్ చరణ్) అనే యువకుడి కథే రంగస్థలం . సినిమా అతని పరిచయం తో మొదలవుతుంది. రామ లక్ష్మి(సమంత ) తో మొదటి చూపు లోనే ప్రేమ లో పడతాడు. వీరి కథ ఆలా సాగుతుండగా ., ఊరి పెద్ద జగపతి బాబు పరిచయమవుతాడు ., అతనంటే జనాల్లో ఎంత భయం,భక్తి ఉందో చూపిస్తూ ..!

చిట్టి బాబు అన్న కుమార్ బాబు (ఆది పినిశెట్టి) పట్నం లో చదువుకొని గ్రామానికి వస్తాడు . అతను గ్రామంలో వున్న సహకార సంఘ రుణాలు ,వాటిలో జరుగుతున్న అవకతవకల్ని గ్రామస్తులకు చెప్పి వారిని చైతన్య పరుస్తాడు. ఈ క్రమం లో ఊరి పెద్ద కు శత్రువు గా మారతాడు.

కొన్ని పరిస్థితుల తర్వాత కుమార్ బాబు ,తమ్ముడి అండ తో ప్రెసిడెంట్ ఎన్నికలలో జగపతి కి ఎదురు నిలబడతాడు . మరి కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత కుమార్ బాబు చంపబడతాడు .

అక్కడి నుంచి ,చిట్టి బాబు తన అన్న ను చంపిన వారిని ఎలా మట్టు బెడతాడు ?ఆ క్రమం లో అతను ఎలాంటి నిజాలు తెలుసుకుంటాడు అనేది తెర మీద చూడాల్సిందే !

విశ్లేషణ

సుకుమార్ సిటీ ల చుట్టూ తిరిగే కథ లు తీసి తీసి ఉన్నాడేమో ., వెరైటీ అనగానే పల్లెటూరి కథ ,మేక్ అప్ లేని మొహాలు , విపరీతం గా కొట్టుకు చచ్చే గ్రామ కక్షలు తీసుకొని బయల్దేరాడు. ఏమన్నా తీసే విధానం లో కొత్తగా చూపించాడా అంటే అదీ లేదు . తమిళ మసాలా బాగా దట్టించి ,అవసరానికి మించిన మెలో డ్రామా తో ద్వితీయార్ధం లో బాగా విసిగించాడు . అంతలో కొంత మొదటి భాగం బావుంది .

రామ్ చరణ్ నటుడిగా మెరుగయ్యాడు .అది ట్రైలర్ లోనే కనిపించింది . సినిమా లో మూడు గంటల పాటు ఆ పాత్ర కోసం అతను ఎంత శ్రమించాడో తెలుస్తుంది . చెవుడు అని పెట్టారు కానీ., రాజా ది గ్రేట్ లో రవితేజ కి గుడ్డితనం ఎలా అడ్డు కాదో ., ఇందులో చరణ్ కు కూడా అదేమీ అడ్డు కాదు . తెలుగు హీరో కదా ! వాళ్ళకి అతీత శక్తులుంటాయి మరి ..!

సమంత కొంత సేపు క్యూట్ గా కనిపించడం ., మరి కొంత సేపు ఏడుపు మొహం తో కన్పించడం తప్ప చేసిందేమి లేదు ., ఆమె పాత్ర కు అంతకు మించి స్కోప్ కూడా లేదు .

ఆది,అనసూయ ,జగపతి బాబు ,ప్రకాష్ రాజ్ ,నరేష్,రోహిణి,పూజిత తమ పాత్రల పరిధి మేరకు నటించారు . జిగేలు రాణి లా పూజ అలరించింది.
రత్నవేలు కెమెరా పనితనం బావుంది . 30 ఏళ్ళు వెనక్కి వెళ్లి మన కళ్ళకు కట్టినట్లు సన్నివేశాల్ని చూపించాడు . దేవి సంగీతం కచ్చితం గా సినిమా కు ప్లస్ ! పాటలన్ని తెర మీద గ్రాండ్ గా వున్నాయి . మైత్రి మూవీస్ వారు సినిమా కు అవసరమైనంత ఖర్చు పెట్టారు . పాత్ర లన్ని పాత చింతకాయ పచ్చడి లా వున్నా ., ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉందంటే అది వారి చలవే !

నవీన్ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో దారి తప్పింది . ఎన్నికలు,దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు సుదీర్ఘం గా వున్నాయి . వాటిని కత్తిరిస్తే బావుండేదేమో !

సుకుమార్ తన ప్రయత్నం బాగానే చేసాడు కానీ . ఆనాటి కాలాన్ని కాళ్ళ ముందు తెప్పించడం లో మాత్రమే సఫలమయ్యాడు . మిగతా అంతా అదే మూస కథ,ప్రతీకారం,సెంటిమెంట్ చుట్టూనే తిప్పాడు .అన్ని సినిమాల్లో ఉండేవి అవే అయినా .,హత్తుకునేలా.,అది మనకు తెలిసిన ఎవరికో కలిగిన కష్టం లా చూపడం లో మాత్రం విఫలమయ్యాడు.

చివరగా  : తెలుగు ప్రేక్షకులు ఈ కథ ను, సినిమా ను ఎంత వరకు తీసుకోగలరో ., దాన్ని బట్టి రంగస్థలం ఫలితం ఆధారపడి వుంది . మెగా ఫాన్స్ కి నచ్చితే నచ్చొచ్చు కానీ.,సాధారణ ప్రేక్షకుడికి ఇది అంత త్వరగా మింగుడు పడే పదార్ధం కాదు . చూద్దాం రంగస్థలం ఎంత మేరకు రంజింప చేస్తుందో !

ఒక్క మాట లో .. : ఇంత కొత్త(పాత)దనం కష్టం సుమీ ..!

 

Advertisement