రాష్ట్రానికి జగన్‌ రావాలి-జగన్‌ కావాలి

వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు అలీ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.కావలి నియోజకవర్గంలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ…ఎందరో పేదలను పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌ ఆదుకున్నారని పేర్కొన్నారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని,రాష్ట్రానికి జగన్‌ రావాలి-జగన్‌ కావాలి అని వ్యాఖ్యానించారు.రాజన్న రాజ్యం వస్తుందని,రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను గెలిపించి సీఎంను చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అలాగే మరో పక్క సినీ ఇండస్ట్రీ నుంచి కూడా వైస్సార్సీపీ లోకి చేరికలు జరుగుతునే వున్నాయి.
తాజాగా దివంగత దర్శక, నిర‍్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

అనంతరం దాసరి అరుణ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరా.
మా నాన్న దాసరి నారాయణరావు ఉండుంటే వైఎస్సార్ సీపీ నుండి పోటీ చేసేవారు. వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారం చేస్తా…అని తెలిపారు.