మాస్ మహారాజ్‌ తో జతకట్టనున్న టాక్సీవాలా హీరోయిన్‌ !

టాక్సీవాలా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌.తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

‘మహర్షి’ లో విలన్ అతడేనట !

Raviteja with Priyanka Jawalkarవిఐ ఆనంద్‌ దర్శకత్వంలో సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ నటించనున్నాడన్న విషయం తెలిసిందే .టాక్సీవాలా చిత్రంలో మంచి నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, మాస్ మహారాజ్‌ రవితేజ సినిమాలో హీరోయిన్‌గా జతకట్టనున్నారని సమాచారం.

ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్‌.ఇప్పటికే ఈ చిత్రంలో RX100 ఫేమ్ పాయల్‌ రాజ్‌పుత్‌ను ఫైనల్‌ చేసినట్టుగా సమాచారం.

Advertisement