బాబు ఎత్తులు వర్మ దగ్గర సాగట్లేదే!

RGV against to Chandrababuప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.ఈ సినిమాను వర్మ ఈ నెల 22న విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు.

పవన్ పై వర్మ ట్వీట్ చూశారా?

తెలుస్తున్న సమాచారం ప్రకారం చంద్రబాబు ఎలాగైనా ఈ సినిమాను ఆపాలని అనుకుంటున్నారట.దానికి సాకుగా తెలుగుదేశం పార్టీ పేరు, పార్టీ సింబల్ వాడటంపై అభ్యంతరం తెలపాలనుకుంటున్నారట.

తమ పేర్లు పెట్టి, తమ పార్టీ గుర్తు చూపిస్తూ, తమను కించపరిచే సన్నివేశాలుంటే వాటిని తొలగించాలనే డిమాండ్ తో ,మొత్తం సినిమానే అడ్డుకోవాలనే పన్నాగం పన్నారట.

అందుకే వర్మ ముందు జాగ్రత్తగా,తాజాగా విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో సైకిల్ గుర్తుకు బదులుగా రిక్షా గుర్తు బైట పెట్టి అందర్నీ షాక్ కి గురిచేశారు.బాబుతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మార్చేస్తారట.ఇక లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పరు కాబట్టి ఆమె పేరు ఉంచుతారట.

నిజానికి వర్మ ఇప్పటికే చంద్రబాబు వెన్నుపోటు అందరికి అర్థమయ్యేలా చూపించాడు.తన తెలివితో పేర్లు మార్చి చంద్రబాబు అండ్ బ్యాచ్ వ్యూహాలకు అడ్డుకట్ట వేశారు.ఇక వర్మను ఆపడం బాబు తరమవుతుందో లేదో విడుదల వరకు చూడాల్సిందే.

Advertisement