లోకేష్ తో వర్మ ఆటలు!

RGV Comments on Nara Lokeshప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.కాగా ఈ సినిమా ప్రమోషన్ కు పూర్తిగా ట్విట్టర్ పైనే ఆధారపడ్డాడు.ఈ ఆయుధం ఒక్కటి చాలు వర్మ వాడుకోడానికి,.

చంద్రబాబుని వదలని వర్మ!

మొన్న తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా’ కు ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా అంటూ ఓ మార్ఫింగ్ ఫోటో పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో కానీ, ఆ ఫోటోలో తన తలను తీసేసి లోకేశ్ ఫోటో పెట్టి వరుసగా ట్వీట్ల వర్షం కురిపించాడు.

నారా లోకేశ్ కత్తి పట్టిన ఫోటో తనకు అమితంగా నచ్చిందని, దావూద్ ఇబ్రహీం, ఒసామాబిన్ లాడెన్ కంటే కూడా తనకు నారా లోకేశ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడని సైటైర్లు పేల్చారు.

అంతటితో ఆగకుండా లోకేశ్ కూ తారక్‌ కూ ముడిపెట్టి కామెంట్లు చేశాడు.అరవింద సమేత సినిమాలో తారక్ బదులు లోకేశ్ ను హీరోగా పెట్టి ఉంటే, సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేదన్నారు.

లోకేశ్ మాంచి హీరో కాకుండా పాలిటిక్స్ లోకి వెళ్లి అనవసరంగా తన టైమ్ వేస్టు చేసుకుంటున్నాడని సానుభూతి కురిపించాడు. అలాగే లోకేశ్ సంబాషణా చాతుర్యం కూడా అద్భుతమంటూ పొగిడాడు.