‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను బాలయ్యకు అంకితం చేసిన వర్మ!

RGV Dedicated to Balakrishnaనిన్న జరిగిన ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’ ఆడియో కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఈ సినిమాకి స్పూర్తి బాలక్రిష్ణ అని,బాలయ్యను కలవకుంటే ఈ సినిమా తీసే ఆలోచన తనకు వచ్చేది కాదని ఆయన చెప్పారు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై లక్ష్మి పార్వతి కామెంట్స్!

అందుకే నందమూరి తారక రామారావు గారి, చివరి రోజుల్లో జరిగిన ఘట్టాల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాని బాలయ్యకు అంకితం చేయబోతున్నానని వర్మ తెలిపారు.

దీంతో అందరు బాలయ్య ఎలా స్పందిస్తారోనని ఎదురు చూస్తున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్నికలు కేవలం ఒక నెలరోజులు కూడ లేని నేపధ్యంలో, వర్మ గురించి అదేవిధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ఎక్కువగా పట్టించుకోవడం మంచిది కాదని, టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమాని అడ్డుకోవడానికి ఎటువంటి లీగల్ నోటీసులు పంపించవద్దని, నందమూరి కుటుంబానికి టీడీపీ అధినాయకత్వం నుండి స్పష్టమైన సలహాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.