RGV కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ దడ పుట్టిస్తున్న ట్రైలర్…..

wish you happy diwali to viewers and followers

Image

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీపావళి పండగ కానుకగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, జగన్ ఎవర్నీ వదలకుండా అందరికి దడ పుట్టిస్తున్నాడు వర్మ.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ వర్మ తన కాంట్రవర్సీ మార్క్ ను
చూపిస్తూ, రెండు నిమిషాల 50 సెకనులు నిడివితో వర్మ వాయిస్ ఓవర్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వివాదాలను రక్తికట్టించారు .

బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ.. చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి’అంటూ సీఎం తొలి సంతకం తో మొదలు పెట్టి తాజా రాజకీయ పరిస్థితులు చూపించాడు .

“ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు ఉమా ” అంటూ చంద్రబాబు పాత్రధారి మాట్లాడుతూ కొన్ని సన్నివేశాలను చూపుతూ “చిన్న బాబు ని సీఎం ని చేసే బాధ్యత నాది అని బాబు కి మాట ఇస్తున్న సహచరుడు ……,విజయవాడ లో ప్రశాంత వాతావరణాన్ని తేవాలి అంటున్నా సీఎం, …రక్త చరిత్రను మరిపిస్తున్న బెజవాడ వాతావరణం .

 

బ్రేకింగ్ న్యూస్..రాష్టం లోనే ఎన్నడూ కనివిని ఎరుగని విధంగా రాష్టం లో హత్య రాజకీయాలు మొదలయ్యవి ….ఇప్పుడు బిగ్ న్యూస్ ..బిగ్ డిబేట్ . మన ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి గా నమ్మకం పోతుంది అని అంటున్న సీఎం సలహాదారుడు.

బ్రేకింగ్ న్యూస్….అరెస్ట్ కి పూర్తి గా రంగం సిద్ధం అయినట్లు అభిజ్ఞన వర్గాల బొగ్గతా …. “ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే” అంటున్న పవన్ , చివరగా డైనింగ్ టేబుల్ వద్ద ఏడుస్తూ తింటున్న లోకేష్ కి పప్పు వాడిస్త్తున్న బాబు …

నేను విజయవాడ లోనే ఉంటున్నాను అన్న విషయం మర్చిపోవద్దు అంటున్న సీఎం జగన్ ,ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అంటున్న బాబు . ఇక చూడాలి కమ్మ రాజ్యం లో కడప రెడ్లు ఏమి చేయబోతున్నారో ?????

ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు.