ఆ ట్వీట్ తో చంద్రబాబు లాక్ అయినట్లే!

RGV Locks CBNరాంగోపాల్ వర్మ ఏది చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఆయన నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇప్పటికే విపరీతమైన హైప్ తీసుకు వచ్చారు.

చంద్రబాబుని వదలని వర్మ!

ఈ చిత్రం ఏపి రాజకీయాల్లో ప్రకంపణ సృష్టిస్తుందని,ఎన్టీఆర్ చివరి రోజుల్లో పడ్డ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెరపై చూడవొచ్చని,ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత, తన వాళ్లచే ఆయన ఎలా పరాభవించబడ్డాడో ఈ చిత్రంలో చూడవొచ్చని ,ఇలా ఎన్నో రకాలుగా చిత్రంపై అంచనాలు పెంచుతూ వస్తున్నాడు.

తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ లో , ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని,కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, ఆయనే దగ్గరుండి ఈ సినిమా విడుదల అయ్యేలా చూస్తారని కామెంట్ చేశాడు. చివర్లో జై చంద్రబాబు అంటూ తన మార్క్ పంచ్ ఇచ్చారు.