వర్మ ఎక్కడా తగ్గట్లేదే!

RGV Ready for Warసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’,ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు మరో రెండు రోజులలో జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమీషన్ నుంచి ,అడ్డంకులు వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి.

బాలయ్యను ఆడుకుంటున్న వర్మ!

దీంతో వర్మ ఈసినిమా విడుదలకు వారంరోజులు ముందుగా ప్రీమియర్ షో వేసి,మీడియా ప్రతినిధులకు అదేవిధంగా రచయితలకు చూపించాలని అనుకుంటున్నారట.ఎందుకంటే ఈ పరిస్తుతులలో ఎన్నికల కమీషన్ తో చేయబోయే యుద్ధానికి, సపోర్ట్ గా మీడియా వర్గాలు మేధావుల సహకారం ఉంటుందని ఆయన ఆలోచనట.

ఈసినిమాలో గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన సంఘటనల చరిత్రను మాత్రమే తాను తీసానని, ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విషయాలు తాను ఈ సినిమాలో చూపించడం లేదు అంటూ, వర్మ ఎన్నికల కమీషన్ తో వాదించడానికి న్యాయపరమైన సలహాలు తీసుకున్నట్లు సమాచారం.

Advertisement