‘2.0’ మూవీ రివ్యూ :చిట్టి మెరుపులు.. కొన్నే!!

Robo 2.0 Review

రోబో 2.0 మూవీ రివ్యూ:3.0/5.0

సమీక్ష :’2.0′ చిట్టి మెరుపులు.. కొన్నే!!

2.0 Censor Report

నటీనటులు : రజినీకాంత్ ,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ తదితరులు

దర్శకత్వం : యస్ శంకర్

నిర్మాత : సుభాష్ కరణ్

సంగీతం : ఏఅర్ రహమాన్

సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా

స్క్రీన్ ప్లే : యస్ శంకర్

ఎడిటింగ్ : ఆంటోనీ

‘రోబో’ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా ‘రోబో 2.0’.ఈ సినిమాను శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.తనలోని విజన్ కనిపించేట్టు,4డీ ని పరిచయం చేస్తూ,సినిమాని ఆధ్యంతం అంచనాలను పెంచుతూ తీసుకెళ్ళాడు.ఇక రికార్డుల విషయం పక్కన పెడితే సినిమా కథ చూద్దామా!.

కథ :

ఉన్నట్టుండి సెల్ ఫోన్లు మాయమవుతూ ఉంటాయి.ఇలా ఎందుకు జరుగుతుందో అంతుచిక్కక ఆ నగర ప్రజలు తర్జనభర్జనలు పడుతుంటారు.ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వశీకరణ్ (రజినీకాంత్ ) ని రంగంలోకి దించుతారు.ఈ సమస్యను సామాన్య మనిషి పరిష్కరించలేడని తెలుసుకున్న వశీ, చిట్టి రోబోను తయారు చేస్తాడు.ఆ తరువాత చిట్టి రోబో పక్షి రాజాను (అక్షయ్ కుమార్) ఎలా ఎదుర్కొంటాడు?ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి? ఇవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

శంకర్ ఈ సినిమాలో భారీ విజువల్స్ చూపించడంతో పాటు,సెల్ ఫోన్ వాడకానికి ప్రజలు ఎలా బానిసలు అవుతున్నారో,వీటి వల్ల ప్రకృతిలో నివసించే జీవరాశులకు కలిగే నష్టాలేంటి అనే విషయాన్ని స్పష్టంగా చూపించాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే రజినీకాంత్ తన నటనతో తలైవా అనిపించుకున్నాడు.అక్షయ్ కుమార్ ఎంతో క్రూరంగా,పక్షి రాజులా ప్రేక్షకులను మెప్పించాడు.కాకపోతే హీరోయిన్ కూడా రోబో కావడంతో,కొంచెం ఫీల్ మిస్ అయినట్టు అనిపించింది.

సంగీతంలో ఏఆర్‌ రెహమాన్‌, విజువల్స్ ను తెరకెక్కించడంలో రసూల్‌ పూకుట్టి తమ మార్కును చూపించారు.నిరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ అదుర్స్ అనే చెప్పాలి.ఆంటోని ఎడిటింగ్ చక్కగా ఉంది.ఇక లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఈ సినిమాను నిర్మించారు అందులో ఎలాంటి సందేహం లేదు.

తీర్పు :

సాంకేతికంగా,విజువల్ పరంగా,శంకర్ విజన్ అన్ని ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపించాయి.వీటి మీద బాగా ద్రుష్టి పెట్టిన శంకర్ కథలో కొన్ని చోట్ల లాగినట్టు,హాస్యం పాళ్ళు కొంచెం తగ్గించినట్టు అనిపించింది.ఇక ఇవి తప్పితే నటీనటుల నటన,కథలో ఉన్న మెసేజ్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

Advertisement