చంద్రబాబును డీబార్ చేయాలంటున్న రోజా!

Roja Fired on Chandrababuఎన్నికలకు సమయం దగ్గరపడే దాకా వేచి చూసిన చంద్రబాబు, ఎన్నికల్లో మరోమారు అధికారం చేపట్టాలన్న కాంక్షతో, జగన్ ఇచ్చిన హామీలను దాదాపుగా మక్కికి మక్కీ కాపీ కొట్టేశారని,తమ పథకాలను కాపీ కొట్టేసిన చంద్రబాబును కాపీ మాస్టరని రోజా ఎద్దేవా చేశారు.

జగన్ పై వచ్చిన వార్తలన్నీ పుకార్లే:దగ్గుబాటి

యాత్రలో భాగంగా వైయస్ జగన్ దాదాపుగా అన్ని జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాలను చుట్టేశారు.అక్కడ కుల వృత్తిదారులు – రైతులు – మహిళలు – వృద్ధులు – బడుగు – బలహీన వర్గాలు, ఇలా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలను కలిశారు.

వారి సమస్యలను తెలుసుకొని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలన్న దిశగా ఆలోచన చేసి, అక్కడికక్కడే తాను అదికారంలోకి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తానన్న విషయాన్ని కూడా ఆయన చెప్పేశారు.

ఈ క్రమంలోనే పింఛన్ సొమ్మును 2 వేలకు పెంపు, రైతులకు ఉచితంగా పెట్టుబడి సాయం – కనీస మద్దతు ధర, ఇలా చాలా హామీలనే జగన్ ఇచ్చారు.ఈ హ్యామీలను కాపీ కొట్టిన చంద్రబాబును రోజా ఔట్ డేటెడ్ వెర్షన్ గా,జగన్ ను అప్ డేటెడ్ వెర్షన్ గా కామెంట్స్ చేశారు.

Advertisement