క్రైమ్ స్టోరీ.. రోజా పోసాని ఇద్దరిలో ఎవరికీ?

Roja Posani for TV Showనగరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ,వైపీసీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకురాలు రోజా.ఆమె రాజకీయాలతో పాటు ,బుల్లితెర షోలలో కూడా బిజీగా ఉన్నారు.ఇప్పటికే ఆమె బజర్దస్త్ , రచ్చబండ ,బతుకు జట్కాబండి,రంగస్థలం అనే డ్యాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.

కడపలో టీడీపీకి గుండు సున్నా..

 

ఇక పోసాని కృష్ణమురళి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన రచయితగా , దర్శకుడిగా , నిర్మాతగా,ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.గతంలో రాజకీయాలలో కూడా పోటీ చేశాడు.ప్రస్తుతం రాజకీయ నాయకులపై తనదైన శైలిలో బాణాలు సంధిస్తుంటారు.

అసలు విషయం ఏమిటంటే,రోజా ఓ క్రైమ్ స్టోరీ సీరిస్ కు యాంకర్ గా కనిపించనున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షో ప్రోమో నడుస్తోంది. ‘తస్మాత్‌ జాగ్రత్త’ పేరుతో ఈ క్రైమ్ షో రానుంది.

మొదట్లో ఈ షోకు పోసాని కృష్ణమురళిని యాంకర్ గా అనుకున్నారట. కానీ ఎక్కడ తేడా వచ్చిందో కానీ చివరకు రోజాను యాంకర్‌ గా ఫైనల్ చేశారట.

Advertisement