‘#RRR’ కథానాయికలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న!

RRR Heroinesరెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘#RRR’ మూడవ షెడ్యూల్ కు కలకత్తాలో ప్లాన్ చేసుకున్నారు.నిజానికి ఎన్టీఆర్,రామ్ చరణ్ కు ఇప్పటివరకు నటించిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క అని చెప్పొచ్చు.

‘#RRR’ విడుదలకు డేట్ ఫిక్స్!

ఈ సినిమా బాహుబలికి ఏమాత్రం తగ్గని సినిమా అంటూ,ఈ సినిమా మీద అంచనాలను డబుల్ ట్రిపుల్ అయ్యేలా చేస్తున్నాడు రాజమౌళి.

తాజాగా ఈ చిత్రబృందం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.కాగా జగ్గన్న సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ,ఈ సినిమాలో కథానాయికలపై క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్ సరసన డైజీ అడ్గార్జియోన్స్ ,చరణ్ సరసన అలియా భట్ నటిస్తారని క్లారిటీ ఇచ్చేశారు.అంతేకాదు ఈ భామలిద్దరు ఈ సినిమాలో నటించేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారని రాజమౌళి తెలిజేశారు.ఇక 2020 జులై 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.