#RRR పై వచ్చిన వార్త నిజమే !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రదారులుగా దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కితున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్).

సైరా పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్RRR movie is Periodical Drama

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి.తోలి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు హీరోయిన్స్ ఎవరు అనేది ప్రకటించలేదు.

అయితే ఆ మధ్య సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశం పట్ల రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
కానీ వచ్చిన వార్తలన్నిటిలోను ఒక వార్త చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఈ సినిమా 1940ల నేపథ్యంలో తెరకెక్కుతుందని, రామ్ చరణ్ ఇంట్రో ని బ్రిటిష్ కాలం నాటి ఓ పోలీస్ స్టేషన్ నేపధ్యంలో తీస్తున్నారని దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి.

స్టేషన్ సెట్ ముందు బ్రిటిషర్ల జెండా ఉండటం సెట్ లో ఉన్న ఆర్టిస్టుల గెటప్పులు ఆనాటి కాలంవే అయ్యుండటం అనుమానాలను నిజం చేసింది.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు ప్రపంచంలో పలు భాషల్లో విడుదల చేయనున్నారు.

Advertisement