#RRR మూవీ లేటెస్ట్ అప్డేట్స్

RRR Movie Latest Updatesదర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్).ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయికులుగా నటిస్తున్నారు.

బన్నీ మహేష్ ల తర్వాత నానిదే !

ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ షెడ్యూల్ లో చరణ్ తో పాటు 1000 మంది పాల్గొంటుండగా యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు ఫై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం.

అయితే జక్కన మాత్రం బాలీవుడ్ కథానాయికలను తీసుకునే ఆలోచనలో వున్నాడని తెలుస్తుంది.
దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది అన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.

Advertisement