‘#RRR’ విడుదలకు డేట్ ఫిక్స్!

RRR Release Dateటాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్,రామ్ చరణ్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తారని అభిమానులు కలలో కూడా అనుకోలేదు.కాని అనూహ్యంగా రాజమౌళి బాహుబలి తర్వాత, ఆ సినిమాను మించి మరో సినిమా చేయాలన్న ఆలోచనతో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేశాడు.

#RRR పై వచ్చిన వార్త నిజమే !

కలిసి సినిమా చేస్తున్నా ఎవరి పోర్షన్ వారిదే కాబట్టి ఎన్టీఆర్ నటనకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో రామ్ చరణ్, రామ్ చరణ్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న కారణంతో ఎన్టీఆర్ , ఇద్దరు ఎవరికి వారు గట్టి వర్క్ అవుట్స్ చేస్తున్నారట.

తాజాగా ఈ చిత్రబృందం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.కాగా ఈ సినిమా విడుడలఫై క్లారిటీ ఇచ్చారు.అధికారికంగా 2020 జులై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నారట.

అంటే ఏడాది నాలుగు నెలల సమయంలోనే ‘#RRR’ చూడొచ్చన్న మాట.నిజంగానే ఈ వార్త ఇటు నందమూరి అభిమానులకు అటు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.