సాయి ధరమ్ మెగా భజన శృతి మించుతోందా ?

నటులు, వారి మాటలు ఖచ్చితం గా నిజాలకు కొంచెం దూరం గానే ఉంటాయి . కానీ మరీ సుదూరం గా ఉంటే కష్టమేమో !మంచు ఫ్యామిలీ ఇలా అతి గా మాట్లాడే ., కష్టపడే తత్వమున్నా ఎక్కువ విజయాలు అందుకోలేక వెనుకపడి పోతున్నారు . ఇప్పుడు అలా మెగా మేనల్లుడు కూడా అవసరమున్నా., లేకున్నా తన ఫ్యామిలీ హీరోలని పొగుడుతూ ., తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు.

సాయి ధరమ్ కు టాలెంట్ వుంది .కష్టపడే తత్వముంది . అన్నిటికి మించి తన మేన మామ ల పోలికలు ఉన్నాయి . ఇక తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తాను చేయవలసింది మంచి కథ లతో., మంచి నటన తో ఆకట్టుకోవడమే !కానీ ఈ హీరో అయిన దానికి., కాని దానికి చిరు ని ,పవన్ ని అనుకరిస్తూ ., వారి పాటలని కాపీ చేస్తూ ., వారి భజన సినిమా సంభాషణల లో చేరుస్తూ రాను రాను ఒక సెక్షన్ ప్రేక్షకులకే పరిమితమవుతున్నాడు .

Sai Dahram Tej Speech At Inttelligent PRe Release Eventఇంతకూ ముందు జూనియర్ కూడా ఇలానే చేసి ., కొంత మంది తన సినిమాలే పక్కన పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు .అందుకే ఎంత కష్టపడ్డా 40 కోట్ల క్లబ్ నుంచి పైకి ఎదగలేక పోయాడు . ఆ పొరపాటు ఈ మద్యే గ్రహించి ., టెంపర్ సినిమా నుంచి తన పంధా మార్చి అందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు .

సాయి ఇది త్వరగా తెలుసుకుంటే తనకే మంచిది . బన్నీ ,చరణ్ లా ఒక ప్రత్యేక గుర్తింపు కావాలంటే ఏదైనా ప్రత్యేకం గా చెయ్యాలి కానీ ., ఈ పొగడ్తలు ఏం చేయలేవు మరి !

Advertisement