టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఫిదా బ్యూటీ రొమాన్స్

వంశి పైడిపల్లి దరక్షత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే . పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా ఏప్రిల్ 25 న ఈ చిత్రం విడుదల కానుంది.

‘సైరా’ లో నిహారిక పాత్ర ..

ఇక తాజాగా మహేష్ తన 26 వ చిత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు .
అయితే ఈ చిత్రం లో కథానాయికగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి ని అనుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం .

సాయిపల్లవికి ఉన్న మంచి క్రెజ్ తో ఏకంగా మహేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా లైన్ ఆమెకి వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు.ఈ సినిమా సాయి పల్లవికి ఓకే అయితే తన కాతాలో ఓ పెద్ద ఆఫర్ వచ్చినట్లే.