మామ సినిమాలో కీలకం కానున్న కోడలు నిజమేనా ?

రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో కింగ్ నాగార్జున ‘మన్మథుడు 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించనున్న ఈ చిత్రం మార్చి 12న లాంచ్ కానుండగా ,మొదటి షెడ్యూల్ పోర్చుగల్ లో జరుగనుంది.

మన్మధుడితో జోడి కట్టనున్న రకుల్

రకుల్‌ ప్రీత్‌ సింగ్, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలుగా కనిపించనున్న ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ అంతా యూరప్ లో జరుగనుంది. అయితే ఈ చిత్రంలో సమంత అక్కినేని ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని టాక్‌.ఆమె పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందట.

ఈ పాత్రకు సమంత అయితే బావుంటుందని, కోడలిని మామ అడగటం, స్యామ్‌ వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్‌.ఇది ఇలా ఉండగా ఇదివరకే ‘రాజుగారి గది 2’లో నాగార్జున, సమంత నటించారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు.

Advertisement