‘#RRR’ కీలక పాత్రలో సముద్రఖని!

Samuthirakani in RRR Movie

ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘#RRR’.ఈ సినిమా నుండి ఎలాంటి లీకులు బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఎందుకంటే ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల కళ్ళు ఈ సినిమాపైనే.

‘#RRR’ లో ఎన్టీఆర్?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆశక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో కోలీవుడ్‌ విలక్షణ నటడు సముద్రఖని కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని సముద్రఖనే స్వయంగా వెల్లడించారు. ‘నడోడిగల్‌ సినిమా సమయంలో రాజమౌళి ఓ సుధీర్ఘ మేసేజ్‌ చేసి తనను అభినందించారట.

ఇటీవల ఆయన తనను స్వయంగా ఇంటికి ఆహ్వానించి ‘#RRR’ లో తన పాత్ర గురించి చెప్పారట. తాను వెంటనే అంగీకరించానని తెలిపారు. ప్రస్తుతం సెకండ్‌ షెడ్యూల్‌ షూటింగ్ లో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాల్గొంటున్నారు.కాగా ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Advertisement