“సరిలేరు నీకెవ్వరూ ” బుల్లెటుపై సూపర్ స్టార్…. దీపావళి ట్రీట్ !

దీపావళి పండుగ కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు బుల్లెట్‌పై కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ‘సరిలేరు నీకెవ్వరు’ అన్నట్లుగానే ఉన్నారు. మహేష్ కి జంట గా రష్మిక మందన్న నటిస్తుండగా,లేడీ అమితాబ్ విజయశాంతి చాల గ్యాప్ తర్వాత ఈ మూవీ లో రీఎంట్రీ ఇవ్వబోతుంది.సంక్రాంతి పండగ కనుక గా జనవరి 12న ప్రేక్షకులను అలరించనున్నది.

Image result for sarileru neekevvaru vijayashanthi look