‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీజర్‌ :ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతి మొగుడు వచ్చాడు

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘మీరు ఎవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కాని మీ కోసం మీ పిల్లల కోసం ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మహేష్ బాబు డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటానురా.. మీ కోసం ప్రాణాలను ఇస్తున్నాం రా అక్కడ. మీరేమో కత్తులు గొడ్డలు వేసుకుని ఆడాళ్ల మీద. బాధ్యత ఉండక్కర్లా’ అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్ అనీల్ రావిపూడి మార్క్‌లో చాలా ఫన్నీగా ఉంది. ‘భయ పడే వాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా’ అని మహేష్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌కు విజిల్స్ వేయించేదిగా ఉంది. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ విజయశాంతి సైతం డైలాగ్‌తో అదరగొట్టేసింది.‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతి కి మొగుడు వచ్చాడు’ అంటూ ప్రకాషరాజ్ చెప్పే డైలాగ్‌తో ‘సరిలేరు నీకెవ్వరూ’ టీజర్‌తో దుమ్మురేపుతున్నాడు