రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సాహో’.బాహుబలి సిరీస్ తరువాత వస్తున్న చిత్రం కావడం అలాగే అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఊహకందని రీతిలో ‘సాహో’ యాక్షన్ సీన్స్

Shades of Sahoo 2 on March 2ndఇటీవల ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1’ మేకింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక తాజా సమాచారం ప్రకారం శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా ‘షేడ్స్ అఫ్ సాహో చాఫ్టర్ 2 ‘మార్చి 3 న విడుదలచేయనున్నారు.

ఎప్పటినుంచో ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ వీడియో ఎలా ఉంటుందో చూడాలంటే మర్చి 3 వరకు వేచాయి ఉండాల్సిందే.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు , హిందీ , తమిళ భాషల్లో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement