ఆకట్టుకుంటున్న షేడ్స్ అఫ్ సాహో-2 వీడియో

రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’.

మామ సినిమాలో కీలకం కానున్న కోడలు నిజమేనా ?

ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ సుందరి శ్రద్ధాకపూర్‌ నటిస్తోంది.
ఇది వరకే రిలీజ్ చేసిన “షేడ్స్ ఆఫ్ చాఫ్టర్ 1” మేకింగ్ వీడియో ఎంత భీబత్సం సృష్టించారో అందరికి తెలిసిందే.

నిన్న శ్రద్ధాకపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ సాభ్యులు షేడ్స్ ఆఫ్ సాహో- చాప్ట‌ర్ 2 వీడియో ను విడుదల చేశారు.ఇక వీడియోతో ప్రభాస్‌ అభిమానులను ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒకెత్తయితే మరి మొత్తం సినిమాలో సుజీత్ ఇంకెంత విషయం దాచారో చూడాలంటే ఆగస్ట్ 15 వరకు ఆగక తప్పదు.

ఈ వీడియో చూసినట్లయితే అసలు ఇది మన తెలుగు సినిమానా లేక ఏదైనా హాలీవుడ్ యాక్షన్ సినిమానా అన్న అనుమానం రాక తప్పదు.ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.