‘సాహో’ నుంచి మరో సర్ప్రైజ్ !

రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో డార్లింగ్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సాహో’.

#RRR పై వచ్చిన వార్త నిజమే

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తక్కువే అయినా ఒక ప్రత్యేకమైన హైప్ వచ్చింది.

ఇక ఈ సినిమా కోసం దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీ పడకుండా భారీ తారాగణంనే ఎంచుకుంటున్నారు. మొన్ననే హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని రంగంలోకి దింపడంతో ఈ చిత్రం పై అంచనాలు తారా స్థాయికి పెరిగాయి.

ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందని సినీ వర్గాల నుంచి సమాచారం.ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా “షేడ్స్ ఆఫ్ సాహో” అనే ఒక మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ వీడియోకి కొనసాగింపుగా “షేడ్స్ ఆఫ్ సాహో” 2 మేకింగ్ వీడియోని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

వచ్చే నెల మొదటి వారంలో ఈ వీడియోని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.మొదటి వీడియోతోనే విధ్వంసం చేసిన డార్లింగ్ హీరో ఈ రెండో వీడియోతో ఎలాంటి సృష్టింస్తాడో చూడాలి మరి.

Advertisement