ఊహకందని రీతిలో సాహో యాక్షన్ సీన్స్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సాహో’.టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ చిత్రం కూడా ఒకటి.

అడవి దొంగగా ఎన్టీఆర్ …?

రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు కొలవడానికి వీలు లేకుండా పోతున్నాయి.ఇప్పటికే ‘షేడ్స్ ఆఫ్ సాహో’ మేకింగ్ వీడియోతో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా నుంచి వస్తున్న ఒక వార్త వింటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మీ ఊహకి అందని రీతిలో ఉండబోతున్నాయనే చెప్పాలి.

ఈ సినిమా కోసం సుజీత్ ఫేమస్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారట.’ది వాల్, ఐరన్ మ్యాన్, ప్రిడేటర్స్ ‘ వంటి భారీ యాక్షన్ సినిమాలకు పని చేసిన యాక్షన్ డైరెక్టర్ ‘బాబ్ బ్రౌన్’ ఈ సినిమా కోసం వచ్చినట్టు ప్రముఖ రైటర్ కోన వెంకట్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కంపోజ్ చేసే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్ కానున్నాయి.
ఇండియాలోనే భారీ విజువల్స్ తో రానున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement