ఇంట్రస్టింగ్ టైటిల్ తో శర్వా

విజయ్ సేతుపతి, త్రిష కలిసి జంటగా నటించిన 96 చిత్రం తమిళ్ లో  ఘన విజయం సాధించిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇపుడు ఈ చిత్రం తెలుగులో దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్, సమంత కాంబినేషన్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

‘మజిలీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

ఈ సినిమా ని తమిళ్‌లో దర్శకత్వం వహించిన ప్రేమ్‌ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.అయితే అప్పట్లో ఈ సినిమాలో గోపీచంద్ నటిస్తాడని కొన్నాళ్లు, అల్లు అర్జున్ నటిస్తాడని కొన్నాళ్ళు రూమర్లు వచ్చాయి.

ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చెక్కరులు కొడుతుంది.
సినిమా పేరు ‘జాను’ అని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.సమంత ఈ సినిమాలో ప్రముఖ గాయని ఎస్ జానకికి వీరాభిమానిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

సినిమాలో సమంత జానకి పాడిన పాటలను పాడుతుందట,అందుకే ఈ సినిమాకు జాను అనే టైటిల్ అయితే బాగుంటుంది అని ఫిక్స్ చేసినట్టు సమాచారం.