పరిటాల సునీతకి షాక్ :వైసీపీ లోకి కీలక అనుచరుడు

Shock For Paritala Suneethaఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి.

అఖిల ప్రియా నిర్ణయంతో బాబుకి ఊహించని షాక్

ఇప్ప‌టికే ప‌లువురు నేత‌లు వైసీపీ కండువాలు క‌ప్పుకోగా తాజాగా పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

శంకారావం స‌భ‌కు వెళుతున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ర్గ మ‌ధ్య‌లో కాన్యాయ్ అపి మ‌రీ రాజ‌న్న‌కు వైసీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ..పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రాజ‌న్న, మంత్రి ప‌రిటాల సునీత వైఖరి వల్లే నాలుగేళ్లుగా టీడీపీకి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.

నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే నాడు పరిటాల రవితో కలిసి భూస్వామ్య పోరాటాలు చేసినట్టు రాజన్న తెలిపారు.

అయితే రాజ‌న్న ఎన్నికలు సమీపిస్తున్న త‌రుణంలో వైసీపీలో చేర‌డంతో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింద ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.