‘వివిఆర్’ లో ఆ సీన్స్ కట్ చేశారట !

బోయపాటి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ కి ఓకే చెప్పిన ‘వెంకీ మామ’

సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే ఈ చిత్రంలోనీ కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా లో తెగ ట్రోల్ అవుతున్నాయి.

‘రంగస్థలం’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన చరణ్ కు,బోయపాటి శ్రీను ఇలాంటి సినిమాను ఇస్తాడని ఊహించలేదని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వేగంగా వెళ్తోన్న ట్రైన్‌పై చరణ్ దర్జాగా నిలబడి రావడం, నాగుపాముతో వివేక్ ఒబెరాయ్ కాటు వేయించుకుంటే ఆ పాము చచ్చిపోవడం

వంటి సన్నివేశాలు జనాలను నవ్వుకునేలా చేయడమే కాదు చరణ్ పరువు తీశాయి. దీంతో ఈ చిత్రంలోని ప్రీ క్లైమాక్స్ లో చరణ్ ట్రైన్ పై నిలబడే వెళ్లి సీన్స్ కట్ చేసి ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement