మహేష్ కోసం బాలీవుడ్ భామ ?

దర్శకుడు అనిల్‌ రావిపూడితో టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు త్వరలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే ఆలోచన ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

మహేష్ తో అనిల్ రావిపూడి?

అనిల్ రావిపూడి మూవీలో మహేష్ కు జోడిగా సాయి పల్లవి లేదా రష్మిక లను ఎంపిక చేయాలనీ చూశారు. కానీ ఈ ఆఫర్ కు సాయి పల్లవి నో చెప్పడంతో , రష్మిక ను ఫిక్స్ చేయాలనీ అనుకున్నారు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఓ బాలీవుడ్ భామ పేరును పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మరి సోనాక్షి ఓకే చెపుతుందో లేదో చూడాలి. ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement