స్పైసి సొరకాయ పచ్చడి

స్పైసి సొరకాయ పచ్చడి;

సొరకాయ అంటే కొంతమందికి నచ్చదనుకుంటా.కాని, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది . సొరకాయ పచ్చడి మిక్సీ లో కాకుండా రోటిలో నూరుకొని తింటే ఆ రుచికి ఉండే ప్రతేక్యతే వేరు.ఒకసారి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఆరుచిని ఆస్వాదించండి.

వెజిటబుల్ పకోడీ

sorakaya_pachadi

 

–>కావలసిన పదార్ధాలు;

–> సొరకాయ ముక్కలు -2కప్పులు (చిన్నగా తరిగినవి)
–> నూనె-3 టీస్పూనులు
–> టమాటాలు-2
–> పచ్చి మిర్చి-5-6
–> చింతపండు-(చిన్న ఉసిరికాయ సైజంత)
–> ఉప్పు-రుచికితగినంత
–> వెలుల్లి-2నుండి 3 రెమ్మలు

–>కొత్తిమీర-అరకప్పు
 –> పోపు దినుసులు:
                (1/4 టీ స్పూను మినపప్పు
                 1/4టీ స్పూను పచ్చి సెనగపప్పు,
                 1/4 స్పూను జీలకర్ర,
                 1/4 టీ స్పూను ఆవాలు,
                 ఎండు మిర్చి -1)

తయారీ విధానం;

స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కాక 2 టీస్పూనుల నూనె వేసుకొని ,వేడైన తరువాత ఒక టీస్పూను జీలకర్ర వేసుకోవాలి.
అందులో ముందుగా తరిగిపెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి.
అందులో టమాటా ముక్కలు, కొంచెం చింతపండు వేసుకొని మెత్తపడే వరకు బాగా మగ్గనివ్వాలి.
స్టవ్ కట్టేసి 5 నిముషాలు చల్లారనిచ్చి,తరువాత మిక్సీ లో వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి.
చింతపండు వేసుకొని మెత్తపడే వరకు బాగా మగ్గనివ్వాలి.
మరలా అదే పాన్ లో ఒక టీస్పూను నూనె వేసుకుని పోపు పెట్టుకుని ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమం ఆంతా వేసి బాగా కలుపుకోవాలి.
అందులో ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.
రెసిపీ మొత్తం బౌల్ లోకి తీసుకొని అన్నం లోకి సర్వ్ చేసుకొని తింటే రుచికరంగా ఉంటుంది.