దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో కోహ్లీ సేన 3-0తో క్లీన్‌స్వీప్..!

india VS south Africa test series
india VS south Africa test series

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. 3-0తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. ఇండియాలో 2012 నుంచి టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న భారత్ జట్టుకి ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. పుణె టెస్టులో ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం ద్వారా 120 పాయింట్లని ఖాతాలో వేసుకున్న భారత్ జట్టు మొత్తం 240 పాయింట్లతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.ఈ సిరీస్‌ ముందు వరకూ దక్షిణాఫ్రికాపై ఏ టెస్టు సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయలేదు. దాన్ని ఇప్పుడు విరాట్‌ గ్యాంగ్‌ సాధించింది. ఇక దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం.