ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం :సభాపతి

speaker kodela accepted resignationsఅసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏపీలో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను శుక్రవారం ఆమోదించారు.

వైసీపీ లోకి మరో కాంగ్రెస్ నేత..

మేడా మల్లికార్జున్‌రెడ్డి(టీడీపీ),రావెల కిశోర్‌బాబు(టీడీపీ),ఆకుల సత్యనారాయణ(బీజేపీ) చేసిన రాజీనామాలకు స్పీకర్ కార్యాలయం ఆమోదముద్ర వేసినట్లు ప్రకటించింది.

వీరిలో టీడీపీ నుంచి జనసేనలో రావెల కిశోర్ బాబు చేరగా, మేడా మల్లిఖార్జున రెడ్డి,వైసీపీలో చేరారు. బీజేపీ నుంచి జనసేనలో ఆకుల సత్యనారాయణ చేరారు.

వారు పార్టీ మారే సమయంలో తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాధమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు.రావెల కిశోర్ బాబు ఎప్పుడో రాజీనామా చేశారు.

ఆకుల సత్యనారాయణ, మేడా మల్లికార్జునరెడ్డి కొన్ని రోజుల క్రితం తమ పదవులకు రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖలు పంపారు.

వాటిని ఆమోదిస్తున్నట్టు స్పీకర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ స్థానాల్లో ఉపఎన్నికలకు ఆస్కారం ఉండదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.

పార్టీలు మారుతున్న సమయంలో వీరు ముగ్గురు చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో శుక్రవారం నుంచి మాజీలుగా మారారు.

Advertisement