‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ విడుదల

సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’.సుమంత్ సరసన ఇషా రెబ్బ నటిస్తుండగా,నిర్మాతగా బీరం సుధాకర్ రెడ్డి బాధ్యతలు వహిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో కుమార స్వామి గుడి ఉంటుంది.ఆ గుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.సుమంత్ అన్వేషణ అడుగడునా ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

అలాగే ఇషా రెబ్బ పాత్రకు ఈ సినిమాలో మంచి ప్రాముఖ్యత ఉంది.ఆమె నటనతో,అందంతో అభిమానులను ఆకట్టుకోవడమే కాదు,ఈ సినిమా తరువాత అవకాశాలు కూడా పెరుగుతాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూడండి.

ఫోటో స్టోరీ:రకుల్ మరింత అందంగా!