పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సర్వే ఫలితాలు!

Survey Reportగత ఎన్నికలలో టీడీపీ గెలుపుకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు.అయితే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల సర్వే వివరాలు వెల్లడయ్యాయి.

బాబుకు దూరంగా గంటా.,అసలు ఏమైంది?

ఈ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.మొత్తం 17 స్థానాలు ఉన్న ఈ జిల్లాలో, టీడీపీ 5 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. మరో 5 స్థానాల్లో రెండో స్థానంలో ఉండగా ,మరో 5 స్థానాల్లో మూడో స్థానంలో ఉంది. అంటే ఈ జిల్లాలో టీడీపీ కనిష్టంగా 5 స్థానాలు, గరిష్టంగా 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట.

ఇక ప్రతిపక్ష వైసీపీ విషయానికి వస్తే, 9 స్థానాల్లో ఈ పార్టీ మొదటి స్థానంలో ఉండగా, మరో 6 స్థానాల్లో రెండవ స్థానంలో ఉంది. అంటే ఈ పార్టీ కనిష్టంగా 9 స్థానాలు , గరిష్టంగా 17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట.

ఇక ఈ జిల్లాపై ఎన్నో ఆశలుపెట్టుకున్న జనసేన విషయానికి వస్తే, ఈ జిల్లాలో రెండు స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. మరో 6 స్థానాల్లో జనసేన రెండవ స్థానంలో ఉండగా, 7 స్థానాల్లో జనసేన మూడో స్థానంలో ఉంది. అంటే జనసేన ఈ జిల్లాలో కనిష్టంగా 2 స్థానాలు ,గరిష్టంగా 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట.