ఇదే ట్రెండ్ కొనసాగితే బాబు ఇంటికే!

Surveys Against to Chandrababuరానున్న ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయంపై ఏపీ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది.ఎందుకంటే ఆయా సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ఫలితాలను విడుదల చేస్తున్నారు.ఈ సర్వేలన్నీ వైసీపీకే పట్టం కడుతున్నాయి.

ఆ మాటలకు చెక్ పెట్టిన జగన్!

తాజాగా మరో సంస్థ ఇంటర్నల్ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో ఏం చెప్పారంటే, గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారట.గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ చాలా చోట్ల వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని తేలిందట.

అలాగే టీడీపీ- వైసీపీల మధ్య లెక్కల్లో తేడా చాలా విస్పష్టంగా కన్పిస్తోందట. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం ఫలితాలు అధికార పార్టీకి చేదు అనుభవాన్ని మిగల్చటం ఖాయం అని ఆ సర్వే కుండబద్దలు కొట్టిందట.

నిజానికి ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏపీ ప్రజలకు చేసిందేమి కనిపించట్లేదు సరికదా ప్రతి రోజు మీడియాతో మాట్లాడుతూ మోడీ,కేసీఆర్,జగన్ ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.దీంతో ఏపీ ప్రజలకు చంద్రబాబుపై అనుమానాలు వస్తున్నాయట.