టీజర్: ఫన్నీ సూర్యకాంతం

నాగబాబు కూతురు నిహారిక , ఫైట్‌ మాస్టర్‌ విజయ్ తనయుడు రాహుల్‌ విజయ్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సూర్యకాంతం’.ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ వెబ్‌ సిరీస్‌ ‘ముద్దపప్పు ఆవకాయ’ డైరెక్టర్‌ ప్రణీత్‌ తెరకెక్కిస్తున్నారు.కాగా సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగా హీరో, నిహారిక సోదరుడు వరుణ్‌ తేజ్‌ ‘సూర్యకాంతం’ టీజర్‌ ను ఈరోజు విడుదల చేశారు.

ఎన్టీఆర్ ని మిస్ అయ్యానే!

ఇక టీజర్ విషయానికి వస్తే ,నిహారిక ఎంట్రీతో మొదలవుతుంది, ‘ నీ గురించి చెప్పు.. అయినా పేరు కన్నా ఎక్కువ తెలుసుకుని ఏం చేస్తా.. తినడానికి పుణుగుల్లేవు గానీ బెగ్గర్‌ కి బర్గర్‌ తినిపిస్తా అన్నాడట’ అంటూ నిహారిక క్యూట్ గా చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో ‘ పెళ్లికి ఒప్పుకోకపోతే చెయ్యి కోసుకుంటా’ అంటూ సుహాసిని బెదిరించడం.. ఆ వెంటనే నిహారిక ఐదంకెలు లెక్కబెట్టి కోసుకో అని చెప్పిన డైలాగ్స్‌ బాగున్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్‌ చూడండి.

Advertisement