ఆకట్టుకుంటున్న ‘సూర్యకాంతం’ ట్రైలర్‌

ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా రాహుల్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘సూర్యకాంతం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

నాని 24 మూవీకి టైటిల్ ఫిక్స్

కాగా ట్రైలర్ ‘నా పేరు అభి’ అంటూ మొదలయింది. ట్రైలర్ చూస్తుంటే సూర్యకాంతం – పూజ అనే ఇద్దరి అమ్మాయిల మధ్యలో నలుగిపోయే అభి అనే కుర్రాడి చుట్టూ ఈ కథ సాగుతున్నట్లు అనిపిస్తోంది. లవ్, ఎమెషన్స్, ఫన్, సెంటిమెంట్ మేళవింపుతో ‘సూర్యకాంతం’ ఈ సారి హిట్ కొట్టేట్టు కనిపిస్తుంది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తుండగా రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ ట్రైలర్‌పై మీరూ కూడా ఓ లుక్కేయండి.