చంద్రబాబుపై కేసు పెడతానంటున్న పీఠాధిపతి!

Swaroopanandendra Swami about CBNప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో అవినీతి తారస్థాయికి చేరిందని,తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన ఇష్టారాజ్యంగా మారిందని, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఆరోపిస్తున్నారు.

జగన్ వెనుక ఇంత కుట్రా!

అంతేకాదు ఆలయాల భూములు మాయమయ్యాయని, వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందని, త్వరలో వాటిని మీడియా ముందు పెట్టి టీటీడీ అధికారులపైన, ముఖ్యమంత్రి పైన కేసు పెడతానని చెబుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి కారణం తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమేనని,ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మార్పు కోసం,చంద్రబాబు పదవి పోయేందుకు, త్వరలో రాజశ్యామల యాగం చేస్తానని స్వామిజీ కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.