‘సైరా’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.

టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఫిదా బ్యూటీ రొమాన్స్

ఇక ఈ చిత్రంలో మెగా స్టార్ సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా తమన్నా నాట్యకారిని పాత్రలో కనువిందు చేయనున్నారు. అయితే తాజా ప్రకారం హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీ సెట్ లో షూట్ చేస్తోంది

చిత్రబృందం .ఈ షూటింగ్ లో చిరంజీవి మరియు జగపతి బాబు కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ఈ నెల 10వ తేదీన పూర్తి కానుంది.

ఈ షెడ్యూల్ పూర్తి అయితే చివరి షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందట.ఇక చివరి షెడ్యూల్ లో సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతునట్లు తెలుస్తుంది.

ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణం నటిస్తుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ మ్యూజిక్ ను అందిస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

Advertisement