పోటా పోటీగా సైరా సాహో!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’.అయితే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి ప్రభాస్ నటిస్తున్న’సాహో’ పోటీగా రిలీజ్ కాబోతోంది.

ప్రభాస్ 21సినిమా సుకుమార్ తో నట!

ఒకే రోజు రెండు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలయ్యేలా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తుండడం టాలీవుడ్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తోంది.ఆగస్టు 15, 2019లో ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలైనట్లు సినీ వర్గ సమాచారం.’సాహో’ చిత్రం మొదట సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తెస్తామని ముందే ప్రకటించిన చిత్ర బృందం ఆ డేట్ కు సినిమా వచ్చే అవకాశం లేక పోవడంతో సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇపుడు ఆగస్టు 15కు ఫిక్స్  అయినట్లుగా తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ‘సైరా’ చిత్రాన్ని కూడా ఆగస్టు 15వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించడానికి కారణం సినిమా కథ యొక్క నేపథ్యమే అంటున్నారు.అయితే ఇరు వర్గాలు తమ సినిమాల రిలీజ్ డేట్ను అఫీషియల్‌గా ఇంకా ప్రకటించలేదు.

Advertisement