అల్లు అర్జున్ కి తల్లిగా టబు… ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. యాక్షన్, ఎమోషన తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళంలోన ప్రముఖ నటులని ప్రధాన పాత్రదారులు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్.

బన్నీ-త్రివిక్రమ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్

ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేసి, ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేస్తారట.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందువలన ఆ పాత్రకి టాలీవుడ్ మాజీ హీరోయిన్ టబుని సంప్రదిస్తున్నారట.

ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్లే అంటున్నారు.నదియా-ఖుష్బూ లాంటి యాక్టర్స్ ని ఏరికోరి తీసుకొచ్చే త్రివిక్రమ్ టబుని ఈజీగానే ఒప్పిస్తాడని టాక్.ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి.