మా సినిమాని బాలేదంటారా ? – టాక్సీవాలా పిల్ల!

విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ జంటగా వచ్చిన టాక్సీవాలా పడుతూ ., లేస్తూ, చివరకు మంచి ఫలితాన్నే చూసింది. విడుదలకు ముందు పాపం చాలా కష్టాలే చవి చుసిన ఈ సినిమా ., విడుదలయ్యాక మాత్రం పెద్ద విజయాన్నే నమోదు చేసుకుంది. ఇక అందులో హీరోయిన్ గా నటించిన సగం-తెలుగు అమ్మాయి ప్రియాంక సోషల్ మీడియా లో హడావిడి మొదలెట్టేసింది.

మధ్యలో నోటా తో నేనే కెలుక్కున్నా : విజయ్ దేవరకొండ!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం పాత సామెత. క్రేజ్ ఉన్నప్పుడే సోషల్ మీడియా ని బాగా వాడుకోండి అనేది నేటి సినిమా వారి మాట! ఇది వంటబట్టించున్న ప్రియాంక “ఏంటి ?మా సినిమా బాలేదంటారా ? పైరసీ వెర్షన్ లో చూసి సినిమా బాగా తీయలేదంటారా ? ఇంకా ., బిస్కెట్ ఫిలిం అంటారా ?” కొంటెగా ఒక మెసేజ్ పెట్టింది ఇలా ఒక క్యూట్ పోజ్ తో !

Priyanka jawalkar

అమ్మడు బాగానే హుషారు గా ఉంది ఈ విజయం తో !! ఇక ఇంకో హిట్ వస్తే ప్రియాంక ని పట్టలేమేమో !

Advertisement